Pages

Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Kamadhenuvide (Annamayya Keerthana) in Telugu


Kamadhenuvide (Annamayya Keerthana) – Telugu Lyrics (Text)

Annamayya Keerthanas Kamadhenuvide – Telugu Script

రచన: అన్నమాచార్య

కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ||

హరినామజపమే ఆభరణంబులు
పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరు పాదసేవే భోగము
పరమంబెరిగిన ప్రపన్నులకు ||

దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము |
ఆవిష్ణు కైంకర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ||

యేపున శ్రీవేంకటేశుడే సర్వము
దాపై యితని వందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు ||

Viswaroopamidivo (Annamayya Keerthana) in Telugu


Viswaroopamidivo (Annamayya Keerthana) – Telugu Lyrics (Text)

Annamayya Keerthanas Viswaroopamidivo – Telugu Script

రచన: అన్నమాచార్య

విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము ||

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు |
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము ||

మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
మాడనే వాలిన పక్షుల మరులు |
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
యీడమాకు పొడచూపె ఇహమేపోపరము ||

కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటులేని శ్రీ వేంకటేశుడితడు |
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము ||

Vinnapaalu Vinavale (Annamayya Keerthana) in Telugu


Vinnapaalu Vinavale (Annamayya Keerthana) – Telugu Lyrics (Text)

Annamayya Keerthanas Vinnapaalu Vinavale – Telugu Script

రచన: అన్నమాచార్య

రాగం: భూపాళం

విన్నపాలు వినవలె వింత వింతలు |
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ||

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నంతనింత నదిగోవారే |
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు |
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ||

గరుడ కిన్నరయక్ష కామినులు గములై |
విరహపు గీతముల వింతాలాపాల |
పరిపరివిధముల బాడేరునిన్నదివో |
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ||

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు |
పంకజభవాదులు నీ పాదాలు చేరి |
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను |
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ||

Viduva Viduvaninka (Annamayya Keerthana) in Telugu


Viduva Viduvaninka (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)

Annamayya Keerthanas Viduva Viduvaninka - Telugu Script

రచన: అన్నమాచార్య

రాగం: సూర్యకాంతం

విడువవిడువనింక విష్ణుడ నీపాదములు
కడగి సంసారవార్థి కడుముంచుకొనిన ||

పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను |
ధరణిపై చెలరేగి తనువు వేసరినాను
దురితాలు నలువంకఁ దొడికి తీసినను ||

పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ |
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు ||

యీదేహమే యయిన ఇక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేగినా |
శ్రీదేవుడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమే చొచ్చితి నేనికను ||

Vedukondaamaa (Annamayya Keerthana) in Telugu


Vedukondaamaa (Annamayya Keerthana) – Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Vedukondaamaa – Telugu Script

రచన: అన్నమాచార్య

వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||

ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు |
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ||

వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు |
గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ||

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు |
అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ||

Vedam Bevvani (Annamayya Keerthana) in Telugu


Vedam Bevvani (Annamayya Keerthana)– Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Vedam Bevvani – Telugu Script

రచన: అన్నమాచార్య

వేదం బెవ్వని వెదకెడివి |
ఆదేవుని గొనియాడుడీ ||

అలరిన చైతన్యాత్మకు డెవ్వడు |
కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ |
యిల నాతని భజియించుడీ ||

కడగి సకలరక్షకు డిందెవ్వడు |
వడి నింతయు నెవ్వనిమయము |
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని |
దడవిన ఘనుడాతని గనుడు ||

కదసి సకలలోకంబుల వారలు |
యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి |
వెదకి వెదకి సేవించుడీ ||

Vande Vaasudevam (Annamayya Keerthana) in Telugu


Vande Vaasudevam (Annamayya Keerthana)– Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Vande Vaasudevam – Telugu Script

రచన: అన్నమాచార్య

వందే వాసుదేవం బృందారకాధీశ
వందిత పదాబ్జమ్ ||

ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-
చందనాంకిత లసత్చారు దేహమ్ |
మందార మాలికామకుట సంశోభితం
కందర్పజనక మరవిందనాభమ్ ||

ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనమ్ |
నిగమాదిసేవితం నిజరూపశేషప-
న్నగరాజ శాయినం ఘననివాసమ్ ||

కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జమ్ |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేంకటాచలాధీశం భజే ||

Tvameva Saranam (Annamayya Keerthana) in Telugu


Tvameva Saranam (Annamayya Keerthana) – Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Tvameva Saranam – Telugu Script

రచన: అన్నమాచార్య

త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ||

వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా |
భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ||

బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద |
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా ||

వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా |
పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా ||

Tirumala Giri Raaya (Annamayya Keerthana) in Telugu


Tirumala Giri Raaya (Annamayya Keerthana)– Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Tirumala Giri Raaya – Telugu Script

రచన: అన్నమాచార్య

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ |
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ||

సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ |
సరసవైభవరాయ సకలవినోదరాయ |
వరవసంతములరాయ వనితలవిటరాయ |
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ||

గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ |
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ |
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ |
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ||

సామసంగీతరాయ సర్వమోహనరాయ |
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ |
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను |
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ||

Teppagaa Maraaku Meeda (Annamayya Keerthana) in Telugu


Teppagaa Maraaku Meeda (Annamayya Keerthana) -- Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Teppagaa Maraaku Meeda -- Telugu Script

రచన: అన్నమాచార్య

తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు |
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ||

మోతనీటి మడుగులో యీతగరచినవాడు |
పాతగిలే నూతిక్రింద బాయనివాడు |
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు |
రోతయైన పేగుల పేరులు గలవాడు ||

కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు |
బూడిద బూసినవాని బుద్ధులవాడు |
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు |
దూడల నావులగాచి దొరయైనవాడు ||

ఆకసానబారే వూరి అతివల మానముల |
కాకుసేయువాడు తురగముపైవాడు |
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి |
యేకాలముబాయని యెనలేనివాడు ||

Suvvi Suvvi Suvvaalamma (Annamayya Keerthana) in Telugu


Suvvi Suvvi Suvvaalamma (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Suvvi Suvvi Suvvaalamma - Telugu Script

రచన: అన్నమాచార్య

సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె ||

శశి వొడచె అలసంబులు గదచె
దిశ దేవతల దిగుళ్ళు విడచె ||

కావిరి విరసె కంసుడు గినిసె
వావిరి పువ్వుల వానలు గురిసె ||

గతి సేసె అటు గాడిద గూసె
కుతిలకుడిచి జనకుడు నోరు మూసె ||

గగురు పొడిచె లోకము విధి విడిచె
మొగులు గురియగ యమునపై నదచె ||

కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె ||

Srimannaaraayana (Annamayya Keerthana) in Telugu


Srimannaaraayana (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Srimannaaraayana - Telugu Script

రచన: అన్నమాచార్య

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||

కమలాసతీ ముఖకమల కమలహిత |
కమలప్రియ కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభ నీపదకమలమే శరణు ||

పరమయోగిజన భాగధేయ శ్రీ |
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ |
తిరువేంకటగిరి దేవ శరణు ||

Sobhaname Sobhaname (Annamayya Keerthana) in Telugu


Sobhaname Sobhaname (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Sobhaname Sobhaname - Telugu Script

రచన: అన్నమాచార్య

శోభనమే శోభనమే
వైభవముల పావన మూర్తికి ||

అరుదుగ మును నరకాసురుడు |
సిరులతో జెరలు దెచ్చిన సతుల |
పరువపు వయసుల బదారు వేలను |
సొరిది బెండ్లాడిన సుముఖునికి ||

చెందిన వేడుక శిశుపాలుడు |
అంది పెండ్లాడగ నవగళించి |
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి |
సందడి బెండ్లాడిన సరసునుకి ||

దేవదానవుల ధీరతను |
దావతిపడి వార్థి దరుపగను |
శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన |
శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ||

Siruta Navvulavaadu (Annamayya Keerthana) in Telugu


Siruta Navvulavaadu (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Siruta Navvulavaadu - Telugu Script

రచన: అన్నమాచార్య

సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెకా ||

పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా |
గొలుసుల వంకల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా ||

మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా |
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా ||

బింకపు మోతల పిల్లగోవివాడు
సింక సూపులవాడు సిన్నెకా |
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెకా ||

Satulaala Choodare (Annamayya Keerthana) in Telugu


Satulaala Choodare (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Satulaala Choodare - Telugu Script

రచన: అన్నమాచార్య

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు |

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు |
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు ||

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు |
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు ||

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు |
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు ||

Sarvaantaraatmudavu (Annamayya Keerthana) in Telugu


Sarvaantaraatmudavu (Annamayya Keerthana)- Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Sarvaantaraatmudavu - Telugu Script

రచన: అన్నమాచార్య

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను |
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||

వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి |
కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ |
దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి |
జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి |
ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||

వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే |
కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె |
నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||

Sakalam He Sakhi (Annamayya Keerthana) in Telugu


Sakalam He Sakhi (Annamayya Keerthana)- Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Sakalam He Sakhi - Telugu Script

రచన: అన్నమాచార్య

సకలం హేసఖి జానామె తత్
ప్రకత విలాసం పరమం దధసే ||

అలిక మౄగ మద మయ మషి
కలనౌ జ్వలతాహే సఖి జానామే |
లలితం తవ పల్లవి తమనసి ని-
స్చలతర మేఘ శ్యామం దధసే ||

చారుకపొల స్థల కరాంకిత
విచారం హే సఖి జానామే |
నారయణ మహినాయక శయనం
శ్రిరమనం తవ చిత్తే దధసే ||

ఘన కుచ శైల క్రస్చిత విభుమని
జననం హే సఖి జానామే |
కనతురస వేంకట గిరిపతి
వినుత భొగ సుఖ విభవం దధసే ||

Radha Madhava Rati Charitamiti (Annamayya Keerthana) in Telugu


Radha Madhava Rati Charitamiti (Annamayya Keerthana)- Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Radha Madhava Rati Charitamiti - Telugu Script

రచన: అన్నమాచార్య

రాధామాధవరతిచరితమితి
బోధావహం శ్రుతిభూషణమ్ ||

గహనే ద్వావపి గత్వా గత్వా
రహసి రతిం ప్రేరయతి సతి |
విహరతస్తదా విలసంతౌ
విహతగృహాశౌ వివశౌ తౌ ||

లజ్జాశభళ విలాసలీలయా
కజ్జలనయన వికారేణ |
హృజ్జావ్యవనహిత హృదయా రతి
స్సజ్జా సంభ్రమచపలా జాతా ||

పురతో యాంతం పురుషం వకుళైః
కురంటకైర్వా కుటజైర్వా |
పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా-
గిరం వినాసి వికిరతి ముదమ్ ||

హరి సురభూరుహ మారోహతీవ
చరణేన కటిం సంవేష్ట్య |
పరిరంచణ సంపాదితపులకై
స్సురుచిర్జాతా సుమలతికేవ ||

విధుముఖదర్శన వికళితలజ్జా-
త్వధరబింబఫలమాస్వాద్య |
మధురోపాయనమార్గేణ కుచౌ
నిధివద త్వా నిత్యసుఖమితా ||

సురుచిరకేతక సుమదళ నఖరై-
ర్వరచిబుకం సా పరివృత్య |
తరుణిమసింధౌ తదీయదృగ్జల-
చరయుగళం సంసక్తం చకార ||

వచన విలాసైర్వశీకృత తం
నిచులకుంజ మానితదేశే |
ప్రచురసైకతే పల్లవశయనే-
రచితరతికళా రాగేణాస ||

అభినవకల్యాణాంచితరూపా-
వభినివేశ సంయతచిత్తౌ |
బభూవతు స్తత్పరౌ వేంకట
విభునా సా తద్విధినా సతయా ||

సచ లజ్జావీక్షణో భవతి తం
కచభరాం గంధం ఘ్రాపయతి |
నచలతిచేన్మానవతీ తథాపి
కుచసంగాదనుకూలయతి ||

అవనతశిరసాప్యతి సుభగం
వివిధాలాపైర్వివశయతి |
ప్రవిమల కరరుహరచన విలాసై
ర్భువనపతి తం భూషయతి ||

లతాగృహమేళనం నవసై
కతవైభవ సౌఖ్యం దృష్ట్వా |
తతస్తతశ్చరసౌ కేలీ-
వ్రతచర్యాం తాం వాంఛంతౌ |

వనకుసుమ విశదవరవాసనయా-
ఘనసారరజోగంధైశ్చ |
జనయతి పవనే సపది వికారం-
వనితా పురుషౌ జనితాశౌ ||

ఏవం విచరన్ హేలా విముఖ-
శ్రీవేంకటగిరి దేవోయమ్ |
పావనరాధాపరిరంభసుఖ-
శ్రీ వైభవసుస్థిరో భవతి ||

Raamudu Raaghavudu (Annamayya Keerthana) in Telugu


Raamudu Raaghavudu (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Raamudu Raaghavudu - Telugu Script

రచన: అన్నమాచార్య

రాగం: కానడ

రాముడు రాఘవుడు రవికులు డితడు |
భూమిజకు పతియైన పురుష నిధానము ||

అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున |
పరగ జనించిన పర బ్రహ్మము |
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ |
తిరమై ఉదయించిన దివ్య తేజము ||

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో |
సంతతము నిలిచిన సాకారము |
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి |
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము ||

వేద వేదాంతములయందు విఙ్ఞాన శాస్త్రములందు |
పాదుకొన పలికేటి పరమార్ధము |
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన |
ఆదికి అనాదియైన అర్చావతారము ||

Raajeeva Netraaya (Annamayya Keerthana) in Telugu


Raajeeva Netraaya (Annamayya Keerthana)- Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Raajeeva Netraaya - Telugu Script

రచన: అన్నమాచార్య

రాజీవ నేత్రాయ రాఘవాయ నమో |
సౌజన్య నిలయాయ జానకీశాయ ||

దశరథ తనూజాయ తాటక దమనాయ
కుశిక సంభవ యఙ్ఞ గోపనాయ |
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో
విశద భార్గవరామ విజయ కరుణాయ ||

భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ
ఖరదూషణాయ రిపు ఖండనాయ |
తరణి సంభవ సైన్య రక్షకాయనమో
నిరుపమ మహా వారినిధి బంధనాయ ||

హత రావణాయ సంయమి నాథ వరదాయ
అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో
వితత వావిలిపాటి వీర రామాయ ||