Pages

Navarasamuladee Nalinaakshi (Annamayya Keerthana) in Telugu


Navarasamuladee Nalinaakshi (Annamayya Keerthana) – Telugu Lyrics (Text)

Annamayya Keerthanas Navarasamuladee Nalinaakshi – Telugu Script

రచన: అన్నమాచార్య

నవరసములదీ నళినాక్షి |
జవకట్టి నీకు జవి సేసీని ||

శృంగార రసము చెలియ మొకంబున |
సంగతి వీరరసము గోళ్ళ |
రంగగు కరుణరసము పెదవులను |
అంగపు గుచముల నద్భుత రసము ||

చెలి హాస్యరసము చెలవుల నిండీ |
పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము |
అల బొమ జంకెనల నదె రౌద్రంబు ||

రతి మరపుల శాంతరసంబదె |
అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి |
సతమై యీపెకు సంతోస రసము ||

No comments:

Post a Comment