Pages

Navanita Chora Namo Namo (Annamayya Keerthana) in Telugu


Navanita Chora Namo Namo (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)

Annamayya Keerthanas Navanita Chora Namo Namo - Telugu Script

రచన: అన్నమాచార్య

నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో ||

హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో |
మురహర పద్మ నాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో ||

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో |
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమో నమో ||

వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో |
శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజనననుత నమో నమో ||

No comments:

Post a Comment