
Kodekaade Veede (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Kodekaade Veede - Telugu Script
రచన: అన్నమాచార్య
కోడెకాడె వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు ||
గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు |
గుల్ల సంకుఁజక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు ||
కోలచే పసులగాచె గోవిందుడు
కూలగుమ్మె కంసుని గోవిందుడు |
గోలయై వేల కొండెత్తె గోవిందుడు
గూళెపుసతులఁ దెచ్చె గోవిందుడు ||
కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు |
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు
గొందిఁ దోసె నసురల గోవిందుడు ||
No comments:
Post a Comment