Pages

Kanti Nakhilaanda (Annamayya Keerthana) in Telugu


Kanti Nakhilaanda (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Kanti Nakhilaanda - Telugu Script

రచన: అన్నమాచార్య

కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి |
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి |
బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి |
రహి వహించిన గోపురములవె కంటి ||

పావనంబైన పాపవినాశము గంటి |
కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి |
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||

పరమ యోగీంద్రులకు భావగోచరమైన |
సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి |
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||

No comments:

Post a Comment