Pages

Itarulaku Ninu (Annamayya Keerthana) in Telugu


Itarulaku Ninu (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)
Annamayya Keerthanas Itarulaku Ninu - Telugu Script

రచన: అన్నమాచార్య

ఇతరులకు నిను నెరుగదరమా ||
సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితులెరుగుదురు నిను నిందిరారమణా ||

నారీకటాక్షపటునారాచభయరహిత-
శూరులెరుగుదురు నిను జూచేటిచూపు |
ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ||

రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము |
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా-
యోగులెరుగుదురు నీవుండేటివునికి ||

పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు |
పరగునిత్యానంద పరిపూర్ణమానస-
స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ||

No comments:

Post a Comment