
Jaya Jaya Raamaa (Annamayya Keerthana)- Telugu Lyrics (Text) Annamayya Keerthanas Jaya Jaya Raamaa -Telugu Script
అన్నమాచార్య: అన్నమాచార్య
జయ జయ రామా సమరవిజయ రామా |
భయహర నిజభక్తపారీణ రామా ||
జలధిబంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లువిరచినసీతారామా |
అలసుగ్రీవునేలినాయోధ్యరామా
కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా ||
అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గానేకోదండరామా |
ధర నహల్యపాలిటిదశరథరామా
హరురాణినుతులలోకాభిరామా ||
అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా |
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా
మతిలోనబాయనిమనువంశరామా ||
No comments:
Post a Comment